దేశానికే ఆదర్శంగా టి వాలెట్..

265
Shortly Telangana Govt launches T Wallet
- Advertisement -

దేశానికే ఆదర్శంగా టి వాలెట్ నిలవనుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌…స్వయంగా టి వాలెట్‌ను ఆవిష్కరిస్తారని…క్యాష్ లెస్ కార్యకలాపాల దిశగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకు పోయేందుకు టి వాలెట్ పని చేస్తుందన్నారు. దేశంలోని ఒక రాష్ట్రం ప్రత్యేకంగా సొంతంగా వ్యాలెట్ ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి కేటీఆర్ తెలిపారు. టి-వాలెట్‌పై ఐటీశాఖ అధికారులు, టి వాలెట్ సర్వీస్ ప్రొవైడర్లతో మంత్రి కేటీఆర్‌ సమావేశం నిర్వహించారు.

దశలవారీగా అన్ని డిపార్టుమెంట్లకు టి-వాలెట్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. సెక్యూరిటీ, ప్రైవసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆధార్, ఫోన్‌నెంబర్‌తో టి-వాలెట్‌ను వినియోగించాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు ప్రజలకు సులభమైన, సౌకర్యమైన వ్యాలెట్ తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు కంపెనీల ప్రతినిధులకు తెలంగాణ ప్రభుత్వం విజన్ ను వివరించారు. అత్యుత్తమ వాలెట్ తయారీతో దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ మార్గదర్శకంగాగా నిలుస్తుందని మంత్రి అశాభావం వ్యక్తం చేశారు.

Shortly Telangana Govt launches T Wallet

ప్రజలు ప్రభుత్వంతో చేసే ప్రతి నగదు లావాదేవీలను ఉచితంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. మొదట జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌, మీసేవతో ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. దశల వారీగా టి వాలెట్‌ను విస్తరిస్తామని… అన్ని రేషన్ షాపులు, స్కాలర్ షిప్ లు చెల్లింపులను టి వ్యాలెట్ ద్వారా చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తెలిపారు.

తెలుగులో కూడా టి వాలెట్‌ తీసుకొస్తామని…దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఇబ్బందులు ఉండవన్నారు. టి వాలెట్‌ కు ఇచ్చే సమాచారం, ఇతర వివరాలు అత్యుత్తమ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ప్రకారం సురక్షితంగా ఉండేలా చూస్తామని, ప్రైవసీకి ప్రాధాన్యత ఇస్తామన్నారు. టి వాలెట్ ద్వారా తమ సేవలను ఉపయోగించుకునేందుకు, ఈ మేరకు కావాల్సిన అంశాలపై ఇతర శాఖలతో చర్చించాలని మంత్రి ఐటి శాఖ అధికారులను అదేశించారు.

Shortly Telangana Govt launches T Wallet

- Advertisement -