‘య‌ముడు-3″ ఆడియో విడుద‌ల‌…

322
- Advertisement -

వినూత్న‌మైన క‌థాంశాల‌తో పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్‌ క్రేజ్‌ను సంపాందించుకున్న సూర్య హీరోగా, శ్రుతిహ‌స‌న్‌, అనుష్క‌లు జంట‌గా నటిస్తున్న చిత్రం ” ‘S3’య‌ముడు-3″ తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి హ‌రి ద‌ర్శ‌కుడు. గ‌తంలోయ‌ముడు, సింగం చిత్రాలు ఘ‌న‌విజ‌యాలు సాధించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌డు ఆదే సిరీస్‌లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రాన్నిస్టూడియో గ్రీన్‌ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా స‌గ‌ర్వంగా స‌మ‌ర్పిస్తూ తెలుగులో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అదినేత‌ మల్కాపురం శివకుమార్, సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హేరిస్ జైరాజ్ అందించిన ఆడియోని రేపు అన‌గా డిసెంబ‌ర్‌11 న డైర‌క్టుగా మార్కెట్ లోకి విడుద‌ల చేస్తున్నారు. చిత్రాన్ని అన్నికార్య క్ర‌మాలు పూర్తిచేసి 23 న విడుదల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు.

yamudu 3 AUDIO RELEASE DATE

ఈ సందర్భంగా నిర్మాత‌ల్లో ఓక‌రైన మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ ” త‌మిళ‌, తెలుగు బాష‌ల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేఖ అభిమానుల్ని సంపాయించుకున్న సూర్య‌, హరి కాంబినేషన్‌లో రూపొందిన య‌ముడు, సింగం చిత్రాలు ఘ‌న‌విజయాల్ని సాధించాయి. వాటికి కొనసాగింపుగా వస్తోన్న చిత్రం ” ‘S3’య‌ముడు-3″. డైర‌క్ట‌ర్ హ‌రి గారు ఈ చిత్రాన్ని మాస్ యాక్ష‌న్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ప‌రుగులు పెట్టే స్క్రీన్‌ప్లే తో థ్రిల్ ని క‌లిగించేలా స‌న్నివేశాల‌తో చిత్రం కొన‌సాగుతుంది. ఇప్ప‌టికే విడుద‌ల‌య్యిన టీజ‌ర్స్ చూసి ప్రేక్ష‌కుల అంచానాలు పెరిగాయి. వారి అంచ‌నాలు అందుకునేలా మా చిత్రం వుండ‌బోతుంది. సూర్య గారు ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ గా యాక్ష‌న్ లో మ‌రోక్క‌సారి విజ్రంబించారు. అనుష్క న‌ట‌న‌కి ఈసారి శ్రుతిహ‌స‌న్ గ్లామ‌ర్ అడిష‌న‌ల్ గా ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌నుంది. నీతినిజాయితీలే ఊపిరిగా భావించే ఓ పోలీస్ అధికారి వృత్తి నిర్వహణలో తనకు ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. తెలుగు వెర్ష‌న్ లో మా సంస్థ పార్ట‌యినందుకు చాలా అనందంగా వుంది. హేరిస్ జైరాజ్ అందించిన ఆడియోని రేపు అన‌గా డిసెంబ‌ర్‌11 న డైర‌క్టుగా మార్కెట్ లోకి విడుద‌ల చేస్తున్నాము. చిత్రాన్ని అన్నికార్య క్ర‌మాలు పూర్తిచేసి 23 న విడుదల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నాము. రాధికా శరత్‌కుమార్, నాజర్, రాడాన్ రవి, సుమిత్ర ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. “అని అన్నారు.

- Advertisement -