వైఎస్ షర్మిల పార్టీ…డేట్ ఫిక్స్!

24
sharmila

వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. జూలై 8న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్నారని తెలిపారు షర్మిల ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ రాజగోపాల్. రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు జులై 8వ తేదీన పార్టీని ఏర్పాటు చేయబోతున్నాం. ఆవిర్భావానికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లను.. కార్యక్రమాలను మేము ఇప్పటికే ప్రారంభించాం అని పేర్కొన్నారు.

అయితే ఇప్పటికే షర్మిల పార్టీ పేరు వైఎస్సార్ తెలంగాణ పార్టీ(వైఎస్‌ఆర్ టీపీ)గా లీకులు అందగా జూలై 8న అధికారికంగా ప్రకటించనున్నారు షర్మిల.
పార్టీ పేరుపై తనకు ఎలాంటి అభ్యంతరమూ లేదని వైఎస్ రాజశేశఖర్ రెడ్డి భార్య విజయలక్ష్మి రాసిన లేఖను ఎన్నికల కమిషన్‌కు అందజేశారు షర్మిల తరపు ప్రతినిధులు. పార్టీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా వారి అఫిషియల్ వెబ్‌సైట్‌లో పార్టీ పేరు పైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఏప్రిల్ 30వ తేదీనే ఎలెక్షన్ కమిషన్ తెలిపింది. ఇప్పటి వరకూ ఎటువంటి అభ్యంతరాలు రాలేదంటే అనుమతుల ప్రాసెస్ పూర్తయినది అనుకుంటున్నాం అని తెలిపింది ఈసీ.