Sharmila:షర్మిల స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా?

17
- Advertisement -

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట ఆమె అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తుందని అందరూ భావించినప్పటికి, అధిష్టానం ఆమెకు పార్లమెంట్ సీటునే కట్టబెట్టింది. అది కూడా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడప సీటును అప్పగించడంతో ఇప్పుడు సొంతింటి పోరు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే వైసీపీ తరుపున ఇక్కడ వైఎస్ అవినాష్ రెడ్డి బరిలో ఉన్నారు. దీంతో షర్మిల వర్సస్ అవినాష్ రెడ్డి పోరులో గెలుపెవరిది అనేది తీవ్ర చర్చనీయాంశంగా ఉన్న అంశం. అయితే బరిలో ఉన్న ఇద్దరు వైఎస్ కుటుంబీకులు కావడంతో ఎన్నికల్లో ప్రజా తీర్పుపై క్యూరియాసిటీ నెలకొంది. .

అయితే కడపలో మళ్ళీ అవినాష్ రెడ్డి గెలవడం ఖాయం అని వైసీపీ ధీమాగా ఉంది. ఎందుకంటే ఏపీలో కాంగ్రెస్ కు బలం లేకపోవడమే అందుకు కారణం. అయితే బరిలో షర్మిల ఉండడంతో ఈసారి పోటీ గట్టిగానే ఉండే అవకాశం ఉంది. ఇక కడపలో తను గెలిచేందుకు వైఎస్ షర్మిల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రధానంగా వైఎస్ వివేక మర్డర్ అంశాన్ని పదే పదే తెరపైకి తెస్తోంది. “సాక్షాధారాలు ఉన్నా చిన్నన్నను చంపిన హంతకులు తప్పించుకుని తిరుగుతున్నారని, దారుణంగా హత్య జరిగితే గుండెపోటుగా చిత్రీకరించారని షర్మిల వ్యాఖ్యానిస్తున్నారు.

వివేకా హత్య కేసులో దోషులు ఎవరో ప్రజలందరికి తెలుసని ఆమె చెప్పుకొచ్చారు. తాను ఎంపీగా పోటీ చేయాలనేది చిన్నన్న చివరి కోరిక అని అందుకే నిందితులుగా ఉన్న వారిపైనే పోటీ చేస్తున్నా”. అని షర్మిల వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. దీంతో చిన్నన్న సెంటిమెంట్ తో షర్మిల అవినాష్ రెడ్డి పై విజయం సాధించిన ఆశ్చర్యం లేదనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. మరి సొంటింటి పోరులో షర్మిల స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ? ఎవరు విజయం సాధిస్తారు ? అనేది చూడాలి.

Also Read:TTD: 5న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

- Advertisement -