ఈటలది భావ దారిద్ర్యం: గందే రాధిక

32
trs

టీఆర్ఎస్ పార్టీ టికెట్ పై గెలిచిన ప్రజాప్రతినిధులు అందరూ పార్టీ లైన్‌లో ఉంటే…..ఈటల రాజేందర్ మాత్రం పార్టీ డబ్బులు ఇచ్చి తనకు దూరం చేశారని ఆరోపించడం ఆయన భావ దారిద్య్రానికి నిదర్శనమని విమర్శించారు హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక.

మీడియాతో మాట్లాడిన ఆమె..హుజురాబాద్ నియోజకవర్గ ములో డబ్బులు వెదజల్లి టీఆర్‌శ్రీస్ ప్రజాప్రతినిధుల ను కొనలేరనే విషయాన్ని మాజీమంత్రి ఈటల హితవు పలికారు.గత మూడు రోజులుగా ఈటల రాజేందర్ తన అనుచరులను పార్టీ ప్రజాప్రతినిధుల వద్దకు పంపి డబ్బుల ఆశ చూపి తన వైపు లాక్కోవలని చేస్తుండటం సిగ్గు చేటన్నారు.

ఈటెల రాజేందర్ ప్రలోభాలకు లోంగే వారెవరూ టీఆర్‌ఎస్‌లో లేరని…..రాజకీయ భవిష్యత్ ఇచ్చిన పార్టీని,ముఖ్యమంత్రి ని విమర్శిస్తున్న ఈటల రాజేందర్ ప్రజల్లో చులకన అయ్యారన్నారు. తనకు200 వందల ఎకరాలు ఉన్నదని ఒక్కో ఎకరం అమ్మి ఒక్కో ఎన్నికను ఎదుర్కుంటానాననే ప్రకటించిన నాడే ఈటల తీరును ప్రజలు గమనించారన్నారు.