రెండో పెళ్లా…పిచ్చోడినా..!

257
shami
- Advertisement -

వద్దురా సోదరా పెళ్లంటే నూరేళ్ల మంటరా అనే పాట అందరికి గుర్తుండే ఉంటుంది. పెళ్లి గురించి నాగ్‌ పాట రూపంలో చెప్పే ఆ డైలాగ్‌లు ఇప్పటికి పెళ్లి సందర్భం వచ్చిన ప్రతి ఒక్కరికి గుర్తుకొస్తాయి. తాజాగా క్రికెటర్ షమీని చూస్తే ఈ పాట గుర్తుకురాక మారదు. ఎందుకంటే త్వరలో షమీ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని ఆయన భార్య జహాన్‌ ఆరోపణలు చేసింది. రంజాన్ తర్వాత తన సోదరుడి చెల్లెల్ని వివాహం చేసుకునేందుకు సిద్దమవుతున్నాడని ఆరోపించింది.

ఈ నేపథ్యంలో షమీ స్పందించాడు. ఒక పెళ్లి చేసుకునే ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారి ఇంకా రెండో పెళ్లి చేసుకుంటానా అని ప్రశ్నించాడు. అంతేగాదు రెండో పెళ్లి చేసుకోవడానికి నేనేమైనా పిచ్చోడినా..ఒకవేళ చేసుకుంటే జహాన్‌ను తప్పకుండా పిలుస్తా అని తెలిపాడు. కుటుంబ సమస్యల కారణంగా గత కొద్ది నెలలుగా నేను మంచి ప్రదర్శన చేయలేకపోతున్నా…. ఇంగ్లాండ్‌ గడ్డపై రాణిస్తా అని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Image result for shami

షమికి జహాన్‌కి కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. షమికి పలువురి అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని, మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని, తనను హత్య చేసేందుకు ప్రయత్నించాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. అంతేగాదు పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఆరోపణలను కొట్టిపారేశాడు షమీ.

- Advertisement -