‘తేజ్ ఐ ల‌వ్ యూ’ విడుద‌ల వాయిదా…

210
tej i love u

సాయి ధ‌ర‌మ్ తేజ్ అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టించిన‌ సినిమా తేజ్ ఐ ల‌వ్ యూ. ఇటివ‌లే షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. జూన్ 9వ ఆడియో లాంచ్ కార్య‌క్ర‌మం కూడా జ‌రుపుకున్న విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజ‌ర‌య్యారు. ఇటివ‌లే విడుద‌లైన టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. రోమాంటిక్ ప్రేమ‌క‌థాగా ఈచిత్రాని చిత్రిక‌రించారు.

 tej i love u

టాలీవుడ్ లో ప్రేమ‌క‌థ‌ల స్పెష‌లిస్ట్ గా పేరుపోందిన క‌రుణాక‌ర‌న్ ఈసినిమాకు ఈసినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌ముఖ నిర్మాత కేఎస్ రామారావు నిర్మాత‌గా వ్య‌వ‌హిరించారు. మంచి ఫిడ్ గుడ్ రొమాంటిక్ ల‌వ్ స్టోరీగా సినిమాను తెర‌కెక్కించారు. ఇక ఈమూవీని ఈనెల 29వ తేదిన విడుద‌ల చేస్తున్నట్లు ప్ర‌క‌టించారు చిత్ర‌బృందం. కొన్ని వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల ఈసినిమా విడుద‌ల వాయిదా వేసిన‌ట్టు తెలుస్తోంది.

 tej i love u

వాయిదా పై ఈచిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా ప్ర‌క‌టించ‌క పోయినా సోష‌ల్ మీడియాలో మాత్రం హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ మూవీని వ‌చ్చే నెల 6వ తేదిన విడుద‌ల చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇక సాయి ధ‌ర‌మ్ తేజ్ ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొడ‌తాన‌ని చాలా న‌మ్మ‌కంతో ఉన్నాడు. వ‌రుస ప్లాప్ ల‌తో స‌త‌మ‌త‌వుతున్న తేజ్ కు ఈసినిమా ఏమేర‌కు విజ‌యాన్ని ఇస్తుందో చూడాలి. ఇక తేజ్ త‌రువాతి చిత్రం గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ ఉండ‌బోతుంద‌నేది స‌మాచారం. ప్లాప్ ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న తేజ్ కు సొంత బ్యాన‌ర్ లో పెద్ద హిట్ ఇవ్వాల‌ని అల్లు అర‌వింద్ చూస్తున్నాడ‌ని స‌మాచారం.