నా నువ్వే విడుదల తేది ఫిక్స్..

290
na nuvve
- Advertisement -

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ తాజాగా న‌టించిన చిత్రం నా నువ్వే. ఈసినిమాలో క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న హీరోయిన్ గా త‌మ‌న్నా న‌టించింది. ల‌వ్ అండ్ యాక్ష‌న్ స్టోరీగా సినిమా ను తెర‌కెక్కించారు. ఈసినిమాకు సంబంధించిన ట్రైల‌ర్ ను ఇటివ‌లే విడుద‌ల చేశారు. రొమాంటిక్ ల‌వ్ స్టోరీగా ఈసినిమాను తెర‌కెక్కించారు. చాలా రోజుల త‌ర్వాత క‌ళ్యాణ్ రామ్ రొమాంటిక్ క‌థ‌ను ఎంచుకున్నాడు. కొద్ది రోజుల క్రితం ఆడియో లాంచ్ కార్య‌క్రామ‌న్ని నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే.

na nuvve

చాలా రోజుల నుంచి ఈసినిమా విడుద‌ల తేది వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. కొన్ని కార‌ణాల వ‌ల్ల విడుద‌లను వాయిదా వేస్తున్న‌ట్లు తెలిపారు చిత్రబృందం. ఇక నేడు విడుద‌ల తేదిని ప్ర‌క‌టించారు చిత్ర యూనిట్. ఈనెల 14న విడుద‌ల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతో విడుద‌ల తేది ప్ర‌క‌టించ‌గానే ప్ర‌మోష‌న్స్ ప‌నిలో ప‌డిపోయారు. సినిమా షూటింగ్ చాలా రోజుల ముందే పూర్త‌యినా కొన్ని కార‌ణాల వ‌ల్ల సినిమాను వాయిదా వేశారు.

na nuvve

త‌మిళ ద‌ర్శ‌కుడు జ‌యేంద్ర ఈసినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో త‌మ‌న్నా రెడియో జాకీ గా క‌నిపించ‌నుంది. ఈసినిమాకు సంబంధించిన పోస్ట‌ర్ల‌కు మంచి స్పంద‌న ల‌భించింది. రోమాంటిక్ స్టోరీల‌కు దూరంగా ఉండే క‌ళ్యాణ్ రామ్ ఈ మూవీతో త‌న అదృష్టాన్ని ప‌రిక్షించుకోబోతున్నాడు. విజ‌య్ , కిర‌ణ్ ఈసినిమాకు నిర్మాత‌లుగా వ్య‌వ‌హిరించారు. క‌ళ్యాణ్ రామ్ చివ‌రి సినిమా ఎమ్మెల్యే అంత‌గా విజ‌యం సాధించ‌క పోవ‌డంతో ఈసినిమాతో ఎలాగైనా స‌క్సెస్ సాధిస్తాన‌నే న‌మ్మ‌కంతో ఉన్నాడు,

- Advertisement -