రాజకీయాల్లోకి షమీ..ఎంపీగా పోటీ!

45
- Advertisement -

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలను సిద్ధం చేస్తోంది బీజేపీ. ఇందులో భాగంగా రాష్ట్రాల వారిగా పొత్తులతో ముందుకు వెళ్తు…ఎంపీ స్థానాలనే టార్గెట్‌గా ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే యువరాజ్ సింగ్‌ బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అయ్యాడని ప్రచారం జరుగుతుండగా తాజాగా షమీ పేరు కూడా వినిపిస్తోంది.

రాబోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బెంగాల్ నుండి బీజేపీ అభ్య‌ర్థిగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బెంగాల్ జ‌ట్టు త‌ర‌పున రంజీ ట్రోఫీలో ష‌మీ ప్రాతినిధ్యం వ‌హించిన విష‌యం తెలిసిందే. అయితే రాజ‌కీయ ఎంట్రీపై ష‌మీ అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

గాయం కారణంగా సర్జరీ జరుగగా దాని నుండి కోలుకుంటున్నారు షమీ. వ‌న్డే వ‌ర‌ల్డ్ కప్ త‌ర్వాత ష‌మీ ఇప్ప‌టి వ‌ర‌కు అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడ‌లేదు.

Also Read:Rajamouli: మహేష్ కోసం రాజమౌళి రిస్క్?

- Advertisement -