విరాట్, షమీ జోరు..ఒకే అడుగు దూరంలో!

40
- Advertisement -

వన్డే ప్రపంచకప్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. లీగ్ మ్యాచ్‌ల్లో 9 విజయాలు సాధించిన భారత్…సెమీ ఫైనల్లోనూ అదే జోరు కంటిన్యూ చేసింది. గత ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది భారత్. ఓ వైపు బ్యాట్స్‌మెన్ మరోవైపు షమీ అద్భుత ప్రతిభ కనబర్చడంతో భారత్ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. 398 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌట్ అయి 70 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మిచెల్ 134 సెంచరీతో ఒంటరిపోరాటం చేయగా విలియమ్ సన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. వీరిద్దరూ మినహా మిగితా బ్యాట్స్ మెన్ అంతా విఫలం కావడంతో కివీస్ ఓటమి తప్పలేదు.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 4 వికెట్లు కొల్పోయి 397 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ 117 పరుగులు చేయగా శ్రేయస్‌ అయ్యర్‌ 70 బంతుల్లోనే 105 పరుగులు చేశాడు. ఇక శ్రేయాస్ ఇన్నింగ్స్‌లో 8 సిక్స్‌లు ఉండటం విశేషం.ఈ మ్యాచ్‌లో సెంచరీ ద్వారా సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు విరాట్. సచిన్ 49 సెంచరీలు చేస్తే విరాట్‌ కోహ్లీ 50వ వన్డే సెంచరీతో అదరగొట్టాడు. ఆదివారం అహ్మదాబాద్‌లో జరుగనున్న ఫైనల్లో… రెండో సెమీస్‌ విజేతతో తలపడనుంది భారత్.

Also Read:ముసుగులో దోస్తీ.. ఇంకెన్నాళ్ళు?

- Advertisement -