పాఠశాలల పున:ప్రారంభంపై కేంద్రం మార్గదర్శకాలు..

298
Schools
- Advertisement -

అక్టోబరు 15 తర్వాత పాఠశాలలను తెరిచేందుకు కేంద్ర విద్యాశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. దశల వారీగా స్కూళ్లు తెరవాలని స్పష్టం చేసింది. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకుని.. స్థానిక అవసరాల మేరకు ప్రామాణిక నిబంధనలు రూపొందించే అధికారాలను రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అప్పజెప్పింది కేంద్రం. విద్యార్థుల హాజరుపై కొంత వెసులుబాటు కల్పించాలని విద్యాశాఖ పేర్కొన్నది. స్కూళ్లు తెరుచుకున్న 2-3 వారాల వరకు ఎలాంటి అసెస్​మెంట్లు ఉండకూడదని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఆన్​లైన్​లో విద్యను అభ్యసించిన విద్యార్థులు.. ఇప్పుడు పాఠశాలలకు చేరుకునే ప్రక్రియ వీలనైంత సులభంగా ఉండాలని విద్యాశాఖ విద్యా సంస్థలకు సూచించింది.

- Advertisement -