బాహుబలిని ఎందుకు చంపానో తెలుసా…?: కట్టప్ప

285
Satyaraj(Kattappa) Reveals Reason Behind Killing Bahubali
- Advertisement -

బాహుబలి2 ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ నిన్న(ఆదివారం) సాయంత్రం అదిరిపోయే రేంజ్‌ లో జరిగింది. ఈ ఈవెంట్‌కి వచ్చిన బాహుబలి ఫ్యాన్స్‌ బాహుబలి2 చూడడానికి ఎంతటి ఉత్సాహంతో ఉన్నారో చెప్పడం కష్టమే. అంతటి ఉత్సాహంతో కూడిన వారి అరుపులతో బాహుబిలి2 స్టేజ్‌ దద్దరిల్లిందనే చెప్పాలి. ఇక ఏప్రిల్‌ 28న వస్తున్న బాహుబలి కోసం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.

  Satyaraj(Kattappa) Reveals Reason Behind Killing Bahubali

ఇదిలా ఉండగా ఈ ఈవెంట్‌ సిని స్టార్స్‌లతో కళకళలాడింది. ఇంత ఘనంగా జరిగిన ఈవెంట్ లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో చెప్పేశాడు. మిర్చి సినిమాలో ప్రభాస్‌ తండ్రిగా సత్యరాజ్ నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఈవెంట్ లో పాల్గొన్న సత్యరాజ్‌ మాట్లాడుతూ..

”కేవలం తమిళనాడులో తప్పించి.. అన్ని ఊళ్ళలోనూ నా పేరు కట్టప్పే. నాకు ఈ పాత్రను ఇచ్చి చాలా పెద్ద సత్కారం చేశారు నిర్మాతలు.. రాజమౌళి.. అలాగే అందరూ” అంటూ ఆనంపడ్డాడు ‘కట్టప్ప’ ఎలియాస్ సత్యరాజ్. అయితే..ఈయన తెలుగులో మిర్చి వంటి సినిమాలో తండ్రి పాత్రలు పోషించి ఎంత ఫేమస్ అవుతున్నా కూడా.. బాహుబలిః ది బిగినింగ్ మాత్రం ఆయనను ఓ రేంజ్‌లో నిలబెట్టిందనే చెప్పాలి. ఇక కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు భలే..ఛమత్కరంగా ఆన్సర్ చెప్పేశాడు కట్టప్ప.

Satyaraj(Kattappa) Reveals Reason Behind Killing Bahubali

”బాహుబలిని ఎందుకు చంపానంటే.. ప్రొడ్యూసర్ బాగా డబ్బులిచ్చాడు.. రాజమౌళి చెప్పాడు.. అందుకే చంపేశాను. లేకపోతే నా డార్లింగ్ ప్రభాస్ ను ఎందుకు చంపుకుంటాను? మిర్చి నుండి మా మధ్యన అనుబంధం ఉంటే” అంటూ ఛమత్కరించాడు సత్య రాజ్. ఈ ఆన్స్‌ర్‌తో అక్కడున్నవారంతా ఒక్కసారిగా అవాక్కైయ్యారు.

ఇక సత్యరాజ్‌ ఫస్ట్ పార్ట్‌ లో కంటే, రెండో పార్టులో కూడా చేసిన రోల్ ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటుందంటూ చెప్పాడు. ఏదేమైనా.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని తల బద్దలుకొట్టుకోవడం కంటే.. కాస్త కష్టంగానైనా ఏప్రియల్ 28 వరకు ఆగితే అందరి డౌట్సూ తీరిపోయాయి..ఏమంటారు..?

- Advertisement -