చేనేత చిన్నది..

155
Samantha in handloom saree

తెలంగాణలో చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సమంత వివిధ ప్రాంతాల్లో పర్యటించి నేతన్నల కష్టాలను తెలుసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చేనేత వ‌స్త్రాల‌ను ప్ర‌మోట్ చేసేందుకు త‌న‌వంతు కృషి చేస్తుంది సమంత. ఇప్పటికే పలుసార్లు తెలంగాణలో చేనేత కార్మికులు ఎక్కువగా వున్న ప్రాంతాల్లో పర్యటించిన సమంత మార్చి 10 సిద్దిపేటలో పర్యటించారు. చేనేత రంగం ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. తనకు తెలిసిన ప్రముఖ డిజైనర్లను వెంటేసుకుని చేనేత కార్మికుల వద్దకు వెళ్ళిన సమంత, డిజైనర్‌ తరహా వస్త్రాల్ని రూపొందించడంపై వారికి ఆయా డిజైనర్లతో సలహాలు ఇప్పించడమే కాకుండా, మార్కెటింగ్‌ విషయమై వారికి భరోసా ఇచ్చింది.

samantha

ఈ క్రమంలో పెద్ద పెద్ద ఈవెంట్లకు చేనేతలోనే ఎంట్రీ ఇస్తోంది. అదిగో నిన్న జరిగిన ఒక కాలేజీ కార్యక్రమానికి కూడా నేత నేచిన చీరలోనే ఈ అందాల చిన్నది ముస్తాబైంది. నల్లటి చేనేత చీరలో ఒక స్టార్ హీరోయిన్ ఎలా ఉంటుందో అంటూ కంగారుపడిన వారికి అమ్మడు తన వయ్యారల వడ్డనతో మతిపోగొట్టేసింది. చేనేతలో కూడా ఇంత అందంగా కనపించవచ్చా అంటూ నిరూపించి.. చేనేతకు నిజంగానే వన్నె తెచ్చేసింది అక్కినేని వారి కోడలు. సమంత ఇప్పుడు తదుపరి రాజు గారి గది సినిమాలో మెరవనుంది. ఆ సినిమా తరువాత తొలిసారిగా రామ్ చరణ్ తో సుకుమార్ డైరక్షన్లో వచ్చే సినిమాలో చేస్తోంది.