‘బాహుబలి’ వెబ్ సీరీస్‌లో లేడీ సూపర్ స్టార్..!

20
Nayanthara

దర్శకధీరుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ చిత్రం ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి అమాంతం పెంచేసిన సినిమా ఇది. అయితే ఇప్పుడీ బాహుబలి చిత్రానికి ప్రీక్వెల్‌గా వెబ్ సీరీస్ రానుంది. ఇందులో కీలక పాత్రను హీరోయిన్ నయనతార పోషించనున్నట్టు తెలుస్తోంది. ఇదే వాస్తవమైతే, ఇది ఆమెకు తొలి వెబ్ సీరీస్ అవుతుంది.

‘బాహుబలి: బిఫోర్ ది బిగెనింగ్’ పేరిట వస్తున్న వెబ్ సిరీస్‌‌కు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ వెబ్ సిరీస్‌కు రాజమౌళి రచన సహకారం అందిస్తున్నారు. తెలుగు దర్శకులు ప్రవీణ్ సత్తారు, దేవా కట్టా దర్శకత్వం వహించనున్నారు. ఇక నయనతార చేస్తోన్న పాత్రపై ఇంతవరకు క్లారిటీ లేదు. అయితే శివగామి పాత్రలో హిందీ నటి వామికా గాబీ నటించనుంది. ఈ వెబ్ సిరీస్ మొత్తం తొమ్మిది ఎపిసోడ్లుగా రూపొందుతుందని తెలుస్తోంది.