‘కాటమరాయుడు’ పైరసీ ప్రింట్…

222
Katamarayudu Full Movie Leaked in Piracy

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘కాటమరాయుడు’ సినిమా విడుదలై మొదటి రోజు మంచి వసూళ్ళు రాబట్టుకుంది.పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించగా.. గోపాల గోపాల ఫేం డాలీ (కిశోర్ పార్థసాని) దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు అనూప్ రుబెన్స్ సంగీతం అందించాడు.అయితే ఈ సినిమా ఇప్పుడు పైరసీ మహమ్మరి చేతుల్లో పడింది దాంతో కాటమరాయుడు టీం ఆందోళనకు గురౌతున్నారట.అసలు విషయానికొస్తే….

అసలే ‘కాటమరాయుడు’ సినిమాకు టాక్ ఏమంత గొప్పగా లేదు. తొలి రోజు వసూళ్లు అదిరిపోయినా.. రెండో రోజు డ్రాప్ అయ్యాయి. వీకెండ్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇలాంటి టైంలో ఈ చిత్రం పైరసీ ప్రింట్ బయటికి వచ్చేయడం ఆందోళన రేకెత్తిస్తోంది. తొలి రోజు బిట్లు బిట్లుగా సోషల్ మీడియాలో వీడియోలు కనిపిస్తే అందరూ లైట్ తీసుకున్నారు. అభిమానులు ఏదో ఉత్సాహంతో థియేటర్లలో క్యాప్చర్ చేసిన వీడియోలివి అనుకున్నారు. కానీ ‘కాటమరాయుడు’ ఫుల్ సినిమా పైరసీ రూపంలో బయటికి వచ్చేయడం చిత్ర యూనిట్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.

Katamarayudu Full Movie Leaked Piracy

కొన్ని పైరసీ వెబ్ సైట్లతో పాటు బయట జనాల మొబైళ్లలోకి కూడా ‘కాటమరాయుడు’ పైరసీ ప్రింటు వచ్చేసింది. ఇది సినిమాకు ఎంతో కొంత డ్యామేజ్ చేస్తుందనే భావిస్తున్నారు. టాక్ బాగుండి.. బిగ్ స్క్రీన్ మీదే చూడాలనిపించే విజువల్ వండర్స్ పై పైరసీ అంత ప్రభావం చూపదు. కానీ డివైడ్ టాక్ ఉండి.. సోషల్ మూవీస్ అయితే మాత్రం ఎఫెక్ట్ పడుతుంది. అదే ‘కాటమరాయుడు’ టీంలో ఆందోళన రేపుతోంది. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలపై పైరసీ ప్రభావం కొంత వరకు తగ్గింది. ఇంతకుముందులాగా రిలీజవ్వగానే పైరసీ ప్రింట్ బయటికి రావట్లేదు. ఆ మధ్య పైరసీ వెబ్ సైట్లకు చెక్ పెట్టడంతో దొంగ ప్రింట్ల విస్తృతి తగ్గింది. అందుకే ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాల పైరసీ గురించి అంతగా వార్తలు రాలేదు. ఇలాంటి తరుణంలో ‘కాటమరాయుడు’ మళ్లీ పైరసీతో వార్తల్లోకి వచ్చింది. ఇప్పటికే ‘కాటమరాయుడు’ టీం సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వాళ్లు పైరసీని నిరోధించే ప్రయత్నంలో ఉన్నారు.