ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ కు సల్మాన్, కత్రినా.. ఎందుకో తెలుసా?

191
IPL FInal Salman

ఐపిఎల్ సీజన్ 12 ఫైనల్ మ్యాచ్ నేడు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగనుంది. సాయంత్రం 7.30నిముషాలకు ఈమ్యాచ్ ప్రారంభం కానుంది. చైన్నై సూపర్ కింగ్స్ తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. టైటిల్ కోసం ఇరు జట్లు కష్టపడుతున్నాయి. ఆదివారం కావడంతో చాలా మంది ఈమ్యాచ్ ను లైవ్ లో చూసేందుకు ఎదురుచూస్తున్నారు క్రికెట్ అభిమానులు. ఇరు జట్లపై భారీ ఆశలు నెలకొన్నాయి. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ కు మరో ప్రత్యేకత ఉంది.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ఈ ఆటను వీక్షించడానికి హోస్ట్ లుగా రానున్నారు. మ్యాచ్ కు ముందు నిర్వహించే ఎంటటైన్ మెంట్ కార్యక్రమాల్లో వారిద్దరూ సందడి చేయనున్నారు. అటు క్రికెట్ , ఇటు సినిమా సెలబ్రెటీలను ఒకే వేదికగా చూసి ఆనందించనున్నారు అభిమానులు. సల్మాన్, కత్రినా కలిసి నటించిన చిత్రం ‘భారత్‌’ జూన్‌ 5న విడుదల కానుంది. ఈ సినిమాకు ప్రచారం చేసుకునేందుకు వాళ్లు టీవీ స్టూడియోలో కనిపించనున్నారట. ఈమ్యాచ్ మధ్యలో సినిమా గురించి అలాగే క్రికెట్ గురించి వారిద్దరూ మాట్లాడనున్నారు.