ఈ ఛాన్స్ మిస్సయితే కొండా దంపతుల చాఫ్టర్ క్లోజ్

174
Konda Surekha

మాజీ మంత్రి కొండా సురేఖకు పొలిటికట్ చాఫ్టర్ క్లోజ్ అయినట్టే అని చెబుతున్నారు విశ్లేషకులు. రాజకీయంగా కొండ దంపతులు లైఫ్ అతి క్లిష్టమైన పరిస్ధితిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవ‌ల జ‌రిగిన ముంద‌స్తు ఎన్నిక‌ల్లో భాగంగా ప్ర‌క‌టించిన 105 మంది అభ్య‌ర్థుల్లో టికెట్ ద‌క్క‌క‌పోవ‌డంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ నిరాశ‌కు గురైన సంగ‌తి తెలిసిందే. మొదటి లిస్ట్ లో ఆమె పేరు లేకపోవడంతో నిరాశ చెందిన ఆమె ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ముందస్తు ఎన్నికల్లో ఆమె పరకాల నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్ధి చల్ల ధర్మారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆమె మళ్లీ ప్రజల మధ్య కనిపించిలేదు. స్ధానిక సంస్ధల ఎన్నికల్ల ప్రచారానికి కూడా ఆమె రాలేదు. రాజకీయంగా కొండ దంపతులకు మరో అవకాశం వచ్చింది. కానీ ఇందులో మాత్రం ఓడిపోతే ఇక వాళ్లు రాజకీయానికి స్వస్తి చెప్పాస్సిందేనని అంటున్నారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో సురేఖ భ‌ర్త కొండా ముర‌ళి అవ‌కాశం ద‌క్కి గెలిస్తే…వారి పొలిటిక‌ల్ కెరీర్ ముందుకు సాగుతుంద‌ని చెప్తున్నారు. 2016లో జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో వరంగల్ నుంచి ఏకగ్రీవంగా గెలుపొందారు కొండా మురళి.

అయితే తాను కాంగ్రెస్ లోకి వెళ్లిన తర్వాత ఆ పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఈస్ధానానికి ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో కొండాకు అవకాశం ఇస్తే మాత్రం పక్కాగా గెలిస్తేనే కొండా ఫ్యామిలికి రాజకీయాల్లో కొనసాగే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఉప ఎన్నికలకు మే 14వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఉపసంహరణకు 17వ తేదీ వరకు గడవు ఉంటుంది. మే 31 ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. జూన్‌ 3న ఓట్లను లెక్కిస్తారు.