రామగుండం ఫర్టిలైజర్స్ పనులపై కేంద్రమంత్రి సమీక్ష

31
sadananda gowda

ఢిల్లీలో రామగుండం ఫెర్టిలైజర్స్ పునర్నిర్మాణ పనులను సమీక్షించారు కేంద్ర మంత్రి సదానంద గౌడ. గ్యాస్ ఆధారిత యూరియా యూనిట్ ద్వారా 12.7 లక్షల మెట్రిక్ టన్నుల నీమ్ కోటెడ్ యూరియా ఉత్పత్తి సాధించాలని లక్ష్యం అన్నారు. తద్వారా దిగుమతుల భారం తగ్గించుకోవడంతో పాటు స్థానికంగా ఉపాధి కల్పించడంపై దృష్టి సారిస్తామన్నారు.

పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి. 99.85 శాతం పనులు పూర్తయ్యాయని, అతి త్వరలో జాతికి అంకితం చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటవుతున్నాయి రామగుండం ఫెర్టిలైజర్స్ కర్మాగారం పనులు.