సింగరేణిలో 372 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

45
sccl

సింగరేణి సంస్థ భర్తీ చేయనున్న ఉద్యోగాలలో తొలివిడతగా 372 పోస్టులకు సంబంధించిన నోటీఫికేషన్‌ ను గురువారం (జనవరి 21వ తేదీ) నాడు విడుదల చేశామని, మిగిలిన పోస్టులకు నోటీఫికేషన్లను దశల వారీగా విడుదల చేస్తామని సి&ఎం.డి. శ్రీ ఎన్‌.శ్రీధర్‌ తెలియజేశారు. కేవలం రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా మాత్రమే అభ్యర్ధుల ఎంపిక ఉంటుందని కనుక కష్టపడి చదివి ఉద్యోగం సాధించాల్సిందిగా గురువారం నాడు ఒక ప్రకటనలో ఆయన ఉద్యోగార్ధులకు పిలుపునిచ్చారు.

మొదటి నోటిఫికేషన్‌ లోని ఉద్యోగల వివరాలు
గురువారం (జనవరి 21వ తేదీ) విడుదల చేసిన తొలి ఉద్యోగ నోటిఫికేషన్‌ లో 7 రకాల ఉద్యోగాలకు సంబంధించి 372 పోస్టుల భర్తీకి సింగరేణి ధరఖాస్తులను ఆహ్వానించింది. వీటిలో 305 పోస్టులను లోకల్‌ వారికి అనగా సింగరేణి విస్తరించి ఉన్న ఉమ్మడి జిల్లాలైన కరీంనగర్‌, అదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాలకు చెందిన అభ్యర్ధులకు కేటాయించారు. (ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 16 జిల్లాలుగా విభజించబడిన విషయం తెలిసినదే). ఇక అన్‌ రిజర్వుడ్‌ గా కేటాయించబడిన 67 పోస్టులకు యావత్‌ తెలంగాణా జిల్లాలకు చెందిన వారందరూ అర్హులే.

పై ఉద్యోగాలకు సంబంధించిన వయోపరిమితి, విద్యార్హతలు, జీతభత్యాలు, ఫీజు చెల్లింపు మొదలైన వివరాలను సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ వెబ్‌ సైట్‌ (www.scclmines.com) లోకి వెళ్లి అక్కడ హోం పేజీలో గల career లింక్‌ను ఓపెన్‌ చేసి తెలుసుకోవచ్చు.

ఆన్‌ లైన్‌ ద్వారానే ధరఖాస్తు చేయాలి

అర్హులైన అభ్యర్ధుందరూ ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నాం 3 గంటల నుండి ఫిబ్రవరి 4వతేదీ సాయంత్రం 5 గంటల వరకూ ఆన్‌ లైన్‌ ద్వారా సింగరేణి వెబ్‌ సైట్‌ లోని కేరీర్‌ లింకు నుండి తమ ధరఖాస్తులు సమర్పించవలసి ఉంటుంది. ఈ ధరఖాస్తులతో పాటు తమ అర్హత సర్టిఫికెట్లను ఆన్‌ లైన్‌ లో ఆప్‌ లోడ్‌ చేయాల్సి ఉంటుంది. కనుక ఎవరూ తమ ధరఖాస్తు హార్డు కాపీలను సింగరేణి రిక్రూట్‌ మెంట్‌ విభాగానికి పంపవద్దని అధికారులు తెలియజేస్తున్నారు. ఆన్‌ లైనులో ధరఖాస్తు చేస్తున్న సమయంలోనే ఇవ్వబడిన ఎస్‌.బి.ఐ. లింకు ద్వారా 200 రూపాయల ఫీజు…