కేంద్రమంత్రి సదానందగౌడని కలిసిన నిరంజన్‌ రెడ్డి..

255
sadananda gowda
- Advertisement -

ఢిల్లీలో కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానంద గౌడ తో భేటి అయ్యారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్థన్ రెడ్డి.రాష్ట్రానికి ఎక్కువ ఎరువులు కేటాయించాలని, కేటాయించిన ఎరువులను త్వరగా రాష్ట్రానికి పంపాలని కేంద్రమంత్రిని కోరారు మంత్రి నిరంజన్ రెడ్డి.

గతంలో ఎన్నుడలేని విధంగా రాష్టంలో వర్షం పడింది…50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వర్షపాతం నమోదు అయింది.రాష్టంలో ఒక కోటి 25 లక్షల ఎకరాల సాగు వేశారు.గతంతో పోల్చితే సాగు విస్తరణ పెరిగింది.రాష్ట్రానికి యూరియా పదిన్నర లక్షల టన్నుల కేటాయించడం జరిగిందన్నారు.

యూరియా ఏడూ లక్షల మెట్రిక్ టన్నుల వాడకంలో ఉంది.వ్యవసాయ రంగం దేశాన్ని బతికిస్తుంది.తెలంగాణ రైతులకు ప్రభుత్వం ఎన్నుదన్నగా ఉంటుంది.రాష్టంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి…పంట నష్టాలు పెద్దగా ఉండకపోవచ్చు.రాష్టంలో ఏ ఏ గ్రామాల్లో ఎంత పంట వేశారు అనేది ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయని చెప్పారు.

ఆగస్టు నెలల్లో ఎరువుల డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.ఈ నెలలో రాష్టానికి కేటాయించిన రెండున్నర లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను త్వరగా పంపించాలని కేంద్రమంత్రిని కోరాం.ఇప్పటి వరకు రాష్టానికి 80 వేల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చింది.పెండింగ్ లో ఉన్న యూరియాను త్వరగా సరఫరా చేయాలని కోరాం.కేంద్రమంత్రి సదానంద గౌడా సానుకూలంగా స్పందించారు.

- Advertisement -