12న తెలంగాణకు ప్రధాని ..

216
- Advertisement -

భారత ప్రధాని నరేంద్రమోదీ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ని జాతికి అంకితం చేయనున్నారు. అందుకోసం ఈ నెల 12న తెలంగాణలో పర్యటించనున్నారు. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించనున్నారు. బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో రానున్న మోదీ..అక్కడినుండి రామగుండంకు హెలికాప్టర్ ద్వారా వెళ్లనున్నారు. ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసిన తర్వాత అక్కడ ఎర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ సమన్వయ సమావేశం నిర్వహించారు. డీజీపీ మహేందర్‌ రెడ్డి, దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌, రామగుండం ఎరువుల కర్మాగారం సీఈవో ఏకే జైన్, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్‌ బీఆర్కే భవన్‌లో సమావేశమయ్యారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను అత్యంత పకడ్బందీగా చేసేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎస్ సూచించారు.

ఇవి కూడా చదవండి.. 

బీజేపీపై ఉద్యమం మొదలైంది:కేసీఆర్‌

గ్రేటర్ రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సులు..

ఆప్ సీఎం అభ్యర్థిగా ఇసుదన్ గాధ్విని..

- Advertisement -