రోహిత్ వచ్చేశాడు!

62
rohith

భారత్ – ఆసీస్ మధ్య కీలకమైన మూడో టెస్టుకు అందుబాటులోకి వచ్చాడు భారత స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ. సిడ్నీలో 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న రోహిత్…టీమిండియాతో జాయిన్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

4 మ్యాచ్ ల ఈ సిరీస్ లో అడిలైడ్‌లో జరిగిన మొదటి టెస్టులో ఆసీస్ గెలుపొందగా, మెల్‌బోర్న్‌లో భారత్ విజయబావుటా ఎగురవేసింది. జనవరి 7 నుండి సిడ్నీలో కీలకమైన మూడో టెస్టు జరగనుంది.