దేశంలో 24 గంటల్లో 21,821 కరోనా కేసులు

46
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. గత 24గంటల్లో దేశంలో 21,821 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 299 మంది మృతి చెందారు. దీంతో మొత్తం సంఖ్య 1,02,66,674కు చేరింది.

ప్రస్తుతం దేశంలో 2,57,656 యాక్టివ్ కేసులుండగా 98,60,280 మంది కోలకుని డిశ్చార్జి అయ్యారు. మొత్తం మరణాల సంఖ్య 1,48,738కి చేరింది. గత 24 గంటల్లో 11,27,244 టెస్టులు చేయగా ఇప్పటి వరకు 17,20,49,271 టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.