సప్తగిరి..’8′

34
sapthagiri

హాస్యనటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా మారిన నటుడు సప్తగిరి. పరుగు సినిమాతో మంచి పేరుసంపాదించుకున్న సప్తగిరి ,ప్రేమకథా చిత్రమ్,వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. రీసెంట్‌గా కమెడీయన్‌ నుంచి హీరోగా మారిన సప్తగిరి తాజాగా మరోసారి అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.

రిజ్వానా ఎంటర్‌టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎయిట్ అనే పేరును ఖరారు చేశారు. అయితే రేపు నూతన సంవత్సర కానుకగా రేపు మధ్యహ్నం ఒంటిగంటకి ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నారు.

నాలుగు భాషల్లో తెలుగు,తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందనుంది. థ్రిల్లర్ మూవీగా వస్తున్న ఈ మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నారు.