IPL 2024 : ఊపిరి పిల్చుకున్న’ముంబై’!

28
- Advertisement -

ఈ సీజన్ ఐపీఎల్ ప్రారంభం నుంచి వరుస పరాజయాలతో సతమతమౌతున్న ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (49), ఇషన్ కిషన్ (42), టిమ్ డేవిడ్ (45), హర్ధిక్ పాండ్యా (39), సేపర్ద్ (39).. పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించారు. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో డిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్లు నష్టపోయి 208 పరుగులతోనే సరిపెట్టుకుంది. దీంతో ముంబైకి తొలి విజయం నమోదు అయింది. అయితే ఒకానొక దశలో డిల్లీ క్యాపిటల్స్ లక్ష్యాన్ని చేధించేలా కనిపించింది.

పృధ్వీ షా (66), అభిషేక్ పొరల్ (41) అద్బుత ఇన్నింగ్స్ కు తోడు స్టుబ్స్ 71( 25 బంతుల్లో ) భీకర ఇన్నింగ్స్ ఆడడంతో గెలిచేలాగే కనిపించింది. కానీ ముంబై బౌలర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో అడిల్లీకి ఓటమి తప్పలేదు. ఇక మరో మ్యాచ్ లో గుజరాత్ టైటైన్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 163 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక గుజరాత్ 130 పరుగులకే ఆలౌట్ గా నిలిచింది. దీంతో లక్నో కు మరో విజయం దక్కింది. ప్రస్తుతం లక్నో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇక ముంబై విషయానికొస్తే గత కొన్ని రోజులుగా అట్టడుగు స్థానంలో ఉండగా.. డిల్లీ పై సాధించిన విజయంతో ఏడో స్థానంలోకి చేరుకుంది. ఆర్సీబీ మరియు డిల్లీ క్యాపిటల్స్ చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి.

నేటి మ్యాచులు

నేడు జరిగే ఐపీఎల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ప్రస్తుతం కే‌కే‌ఆర్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. చెన్నై సూపర్ కింగ్స్ గత మ్యాచ్ లో ఓటమిపాలు కావడంతో ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవలనే పట్టుదలతో ఉంది. మరి ఈ రెండు జట్ల మద్య జరగనున్న పోరులో ఏ జట్టు విజయం సాధిస్తుందో చూడాలి.

Also Read:ఉడకబెట్టిన శనగలు తినడం మంచిదే.. కానీ!

- Advertisement -