చెన్నైని చిత్తుచేసిన ముంబై..

192
mumbai indians

చెన్నై చెపాక్‌లో రైనాను మట్టికరిపించింది రోహిత్ సేన. ఐపీఎల్‌ 12లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ..చెన్నై సూపర్ కింగ్స్ జట్టును 46 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. 156 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టును 109 పరుగులకే కట్టడి చేసింది. మలింగ (4/37), కృనాల్‌ పాండ్య (2/7), బుమ్రా (2/10) ధాటికి 17.4 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. చెన్నై ఆటగాళ్లలో విజయ్ 38, వాట్సన్ 8, రైనా 2, అంబటి రాయుడు 0, జాదవ్ 6, బ్రావో 20 పరుగులు చేశారు.

అంతకముందు బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న పిచ్‌పై రోహిత్‌ శర్మ (67), డికాక్‌ (15) ,లూయిస్‌ (32) ,హార్దిక్‌ పాండ్య (23 ), పొలార్డ్‌ (13 నాటౌట్‌) రాణించడంతో మొదట ముంబయి 4 వికెట్లకు 155 పరుగులు చేసింది.

చెన్నై ఇంతకుముందే ప్లేఆఫ్స్‌లో స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే. ముంబై ఏడో విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ప్లేఆఫ్స్‌కు మరింత చేరువైంది.