నా చెల్లితో పెళ్లేంటి..!:తేజు

248
sai dharam tej

సుప్రీం హీరో సాయిధరమ్ తేజు-మెగా డాటర్ నిహారిక పెళ్లిపై కొంతకాలంగా రకరకాల పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ పుకార్లను నాగబాబు సహా తేజు సైతం పలుమార్లు ఖండించారు. అయితే మళ్లీ పదేపదే రూమర్స్ ప్రచారం అవడంపై మండిపడ్డారు సాయిధరమ్ తేజ్‌. నిహారిక నా చెల్లితో సమానం అని ఇకనైనా స్టూపిడ్‌ రూమర్స్‌కి చెక్ పెట్టండి అంటూ మండిపడ్డారు. మా పర్సనల్ లైఫ్‌ గురించి కామెంట్స్ చేయొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు.

చిత్రలహరి మూవీ సక్సెస్‌ని తెగ ఎంజాయ్ చేస్తున్న తేజు..పలు ఇంటర్వ్యూల్లో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చిన్నప్పటి నుండి తాను నిహారిక బ్రదర్ అండ్ సిస్టర్‌లా ఉన్నాం. నిహారిక, వరుణ్, మా తమ్ముడు ఇలా అందరం బ్రదర్స్ అండ్ సిస్టర్స్‌లాగే ఉన్నాం..అలాగే ఉంటామన్నారు. ఎవడుపడితే వాడు ఇలా ఇష్టం వచ్చినట్లు రాస్తుంటే ఏదో ఒక రోజు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వాడు ఎవడైనా సరే. ఇలా రాయడానికి సిగ్గుండాలని అని ఘాటుగా స్పందించారు.

ప్రస్తుతం తన పెళ్లి గురించి ఏం అనుకోలేదని… ఇంకా సింగిల్ ఆర్మీని వదలదల్చుకోలేదని చెప్పారు. దీంతో తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్న విషయంతో పాటు ఆమె తల్లి రెండో పెళ్లి విషయాన్ని బయటపెట్టాడు సుప్రీమ్ హీరో.