ఐపీఎల్ లో ఆస్ట్రేలియన్స్.. అదరగొడతారా?

54
- Advertisement -

క్రికెట్ లో ఆస్ట్రేలియా టీం ఎంతటి బలమైన జట్టో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ముఖ్యంగా ఐసీసీ టోర్నీలలో ఆస్ట్రేలియా తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తూ వస్తుంది. ఏ జట్టుకు సాధ్యం కానీ రీతిలో ఐదు సార్లు వన్డే వరల్డ్ కప్ గెలిచి చరిత్ర సృష్టించింది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆ జట్టులోని ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉంటుందనేది. ఇక గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ లో కూడా ఆస్టేలియా సత్తా చాటింది. ముఖ్యంగా ట్రావిస్ హెడ్, పాట్ కమీన్స్, ఇంగ్లీస్, మాక్స్ వెల్, వంటి ఆటగాళ్ల ప్రదర్శన వరల్డ్ కప్ కే హైలెట్ గా నిలిచింది. మరి అలాంటి ఆటగాళ్లు ఐపీఎల్ కోసం సిద్దమౌతున్నారు. .

మరో వారం రోజుల్లో ప్రారంభం అయ్యే ఐపీఎల్ సీజన్ లో ఇప్పుడు అందరి దృష్టి ఆస్ట్రేలియా ఆటగాళ్లపైనే ఉంది. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఈ సీజన్ ఐపీఎల్ లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచిన సంగతి తెలిసిందే. రూ.20.50 కోట్లతో ఎస్‌ఆర్‌హెచ్ అతడిని సొంతం చేసుకుంది. అతడి కెప్టెన్సీపై సన్ రైజర్స్ హైదరబాద్ భారీగానే ఆశలు పెట్టుకుంది. ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్ అందించిన కమీన్స్ ఎస్‌ఆర్‌హెచ్ కు ఐపీఎల్ కప్ అందిస్తాడని యజమాన్యం భావిస్తోంది. ఇక వరల్డ్ కప్ ఫైనల్ లో అద్భుత ప్రదర్శన కనబరిచి టీమిండియాకు కప్ దూరం చేసిన ట్రావిస్ హెడ్ కూడా ఎస్‌ఆర్‌హెచ్ తరుపున ఐపీఎల్ లో ఆడనున్నాడు.

వీరిద్దరిపై ఎస్‌ఆర్‌హెచ్ యజమాన్యం ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది. ఇక విధ్వంసకర బ్యాట్స్మెన్ మ్యాక్స్ వెల్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎంతటి ఒత్తిడిలోనైనా భీకరంగా బ్యాటింగ్ చేస్తూ ప్రత్యర్థి జట్లలో వణుకు పుట్టిస్తాడు. మరి అలాంటి మ్యాక్స్ వెల్ ఈ సీజన్ లో కూడా ఆర్‌సి‌బి తరుపుననే ఆడనున్నాడు. మాక్స్ ఏ మాత్రం ఫామ్ కొనసాగించిన ఆర్‌సి‌బి తిరుగులేని జట్టుగా నిలిచే అవకాశం ఉంది. వీరితో పాటు స్మిత్, వార్నర్, ఇంగ్లీస్, మార్ష్.. వంటి ఆసీస్ ప్లేయర్లపై కూడా ఈ ఐపీఎల్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి వీరి ప్రదర్శన ఎలా ఉండబోతుందో చూడాలి.

Also Read:బీఆర్ఎస్‌తో బీఎస్పీ..రెండు ఎంపీ సీట్లు

- Advertisement -