తెలంగాణ కోసం పరిమళించిన ఈ గులాబీకి 18 వసంతాలు..

225
- Advertisement -

ధృడ సంకల్పం లాంటి తెలంగాణ ఉద్యమం చరిత్రపుటల్లో శాశ్వతగా నిలిచిపోయింది. అసాద్యమని అవహేళన చేసిన వారి పట్ల సింహంలా గర్జించి… తెలంగాణ జాతికి స్వేచ్చా వాయువులను అందించింది. పిడికెడు జనంతో మొదలైన ఆ ఉద్యమం ఆకాశమంత ఎగసిపడి., ప్రళయకాల రుద్రుడిలా తాండవించి శత్రువు గెండెల్లో గుణపం దింపింది. దీంతో తెలంగాణ కల సాకారమైంది. జనం జీర్ణించుకోలేక పోయినా, విధి వికటాట్టహాసం చేసినా, ప్రకృతి పగబట్టినా, పట్టు విడువకుండా ఉద్యమాన్ని ఉరకలెత్తించి అనుకున్నది సాధించిన అసమాన ధీరుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ పుడమిపై చెరగని ముద్రవేసుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరైన తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్బవించి 18 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా జీటీ టీవీ స్పెషల్‌ స్టోరీ…

TRS party

టీఆర్‌ఎస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్థాపనే ఏకైక లక్ష్యంగా ఏర్పడింది. 2001 ఏప్రిల్ 27న నేటి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు టీఆర్‌ఎస్ పార్టీని ఏర్పాటు చేశారు. 13 ఏళ్ల ఉద్యమ ప్రస్ధానంలో ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కొని ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చింది టీఆర్‌ఎస్‌. నాడు ఉద్యమ పార్టీగా నేడు రాజకీయ పార్టీగా బంగారు తెలంగాణ సాధనలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే నెంబర్‌ 1 రాష్ట్రంగా తెలంగాణ ముందుకుసాగుతోంది. ఎన్ని అవరోధాలెదురైనా, రాజకీయ పార్టీలు సహకరించకపోయినా, కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టించినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో పార్టీని ముందుకు నడిపించి అనుకున్న కల సాకారం చేశారు సీఎం కేసీఆర్‌.

తెలంగాణ ఉద్యమానికి కీలకంగా మారిన తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్బవ దినోత్సం సందర్బంగా పార్టీ శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అయితే రాష్ట్రంలో ఎలక్షన్‌ కోడ్ ఉండడంతో ఈ సారి పార్టీ అవిర్భావన్ని నిరాడంబరంగా జరుపుకోవాలని టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ అలాగే పార్టీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కేటీఆర్‌ నేతలుకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రమంతటా పార్టీ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించుకోవాలని కేటీఆర్‌ కోరారు.

- Advertisement -