కరెన్సీ కష్టాలు తీర్చేందుకు రెడీ అవుతున్న జియో….!

118

పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా క్యాష్‌లెస్ విధానాన్ని అమల్లోకి తెచ్చి నల్లధనాన్ని ఆరికట్టవచ్చునని ప్రధాని మోదీ భావిస్తున్నారు. ఇప్పటికే డిజిటల్ లావాదేవీలపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఓ కమిటీని కూడా నియమించారు. ఈ కమిటీకి ఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తున్నారు. అయితే ఇప్పుడున్న నోట్ల కష్టాలను గ్రామాల్లో తగ్గించేందుకు మైక్రో ఏటీఎం కార్డులను ఇప్పటికే కేంద్రం అందుబాటులోకి తెచ్చింది.

Reliance Jio epayment

అయితే వీటివల్ల నోట్ల కష్టాలు తీరుతున్నాయో లేదో తెలియదు కానీ రిలయన్స్ జియో కూడా ఈ విధానం ద్వారా ప్రజలకు మరింత చేరువకావాలని భావిస్తోంది. వాకింగ్ ఏటీఎం పేరుతో మైక్రో స్వైపింగ్ మెషిన్లను అందుబాటులోకి తేవాలని ముఖేష్ అంబానీ భావిస్తున్నారట.ఆధార్ కార్డు నెంబర్ సాయంతో ఈ జియో మైక్రో ఏటీఎంలు పనిచేస్తాయని. దీని ద్వారా ఇంటి దగ్గరకు, పొలాల దగ్గరకెళ్లి గ్రామీణ ప్రాంత ప్రజలకు డబ్బునందించాలని జియో యోచిస్తోంది. బ్యాంకు అకౌంట్ లేని వారికి కూడా ఆధార్ కార్డ్ వివరాలు నమోదు చేసుకుని, వేలిముద్రలు తీసుకుని అకౌంట్ ఓపెన్ చేసే సదుపాయం కూడా కల్పించనున్నారట. అయితే ఇవి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో జియో యాజమాన్యం అధికారికంగా మాత్రం ప్రకటక చేయలేదు.

Reliance Jio epayment

ఇటీవలే జియో వినియోగదారులకు రిలయన్స్ అధినేత ముకేష్‌ అంబానీ బంపర్ ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 31 వరకు ఉన్న ఉచిత కాలింగ్…ఫ్రీ డేటా సౌకర్యాన్ని మార్చి 31 వరకు పొడగిస్తున్నట్టు ప్రకటించి జియో వినియోదారుల్లో కొత్త ఉత్సహం నింపారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు జియో సేవలు ఉచితంగా ల‌భిస్తాయ‌ని ఆయన తెలిపారు. అంతేగాక‌, నెంబరు పోర్టబులిటీని స్వీకరించేందుకు జియో సిద్ధంగా ఉందని ఆయన తెలియజేశారు. ఈ నెల 31 నుంచి దేశంలోని 100 న‌గ‌రాల్లో వినియోగ‌దారులు ఆర్డ‌ర్ చేసుకుంటే ఇంటి వ‌ద్ద‌కే జియో సిమ్‌ను పంపే సౌల‌భ్యాన్ని తీసుకొస్తున్నామ‌ని వెల్లడించారు.