హీరో 33..హీరోయిన్‌ 42

114
Dhanush-Kajol-

హీరోలు కొంచెం ఏజ్ బార్ అయినా..హీరోయిన్ల ను మాత్రం పదహారేళ్ల పడుచు భామలనే కోరుకుంటారు. హీరో వయసులో సగం ఏజ్ ఉన్న హీరోయిన్ల..అతడికి జోడిగా నటించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇండస్ట్ర్రీలో ఎంతమంది హీరోయిన్ల ఉన్నా..ప్రెష్ లుక్ కోసం కొత్త అందాలను దించుతుంటారు. పడుచు భామల అందాలతోనే సినిమాకు గ్లామర్ ఘాటును పంచేప్రయత్నం చేశారు. కానీ తమిళ్ హీరో ధనుష్ మాత్రం..కాస్త డిఫరెంట్‌గా ట్రై చేస్తున్నాడు. ఓ సినిమాకు జోడి గా … తన కంటే పెద్ద పెద్ద వయసైన హీరోయిన్‌ ను సెలెక్ట్ చేసుకున్నాడు.

Dhanush-Kajol-

దక్షిణాది హీరో ధనుష్ తనకన్నా 9 సంవత్సరాలు పెద్దయిన బాలీవుడ్ హీరోయిన్ కాజోల్‌ తో జతకట్టనున్నాడు. తెలుగులో ‘రఘువరన్ బీటెక్’గా వచ్చిన తమిళ చిత్రం ‘వేళ ఇల్లే పట్టదారి’కి సీక్వెల్ గా ‘వీఐపీ-2’ తీస్తుండగా, ఈ చిత్రంలో బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ కాజోల్ హీరోయిన్ గా నటించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కాజల్ వయసు 42 దాటగా, ధనుష్ కు 33 మాత్రమే. రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య డైరెక్షన్ లో ఈ చిత్రం రూపొందనుండగా, కాజోల్ ను హీరోయిన్ గా ఒప్పించేందుకు ధనుష్, సౌందర్యలు ప్రయత్నిస్తున్నారు.

కాజోల్డే ట్స్ కోసం షూటింగ్ ను నెల రోజులు వాయిదా వేసినట్టు సమాచారం. కాజోల్ ఈ చిత్రంలో నటిస్తే, దాదాపు 20 సంవత్సరాల తరువాత, అంటే, 1997లో ‘మెరుపుకలలు’ తరువాత ఆమె నటించే మరో దక్షిణాది చిత్రం ఇదే కానుంది. ఇదే కనుక కార్యరూపం దాల్చితే..హీరోయిన్ల విషయంలో ధనుష్‌ కొత్త ట్రెండ్‌కు బాటలు వేసినవాడు అవుతాడు. మొత్తానికి ధనుష్‌ బాలీవుడ్ ముదురుభామ కాజోల్‌  తో రొమాన్స్ చేయబోతున్నాడు.