సూపర్ ఓవర్ లో ముంబైపై ఆర్సీబీ గెలుపు

182
rcb
- Advertisement -

ఐపీఎల్ 13లో భాగంగా మరో ఆసక్తికర మ్యాచ్ జరిగింది. టీ20 అసలైన మజాను రుచి చూపిస్తూ మరోసారి సూపర్ ఓవర్ ఫైట్ జరుగగా గెలుపొందింది. సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో వికెట్ కొల్పోయి 7 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 6 బంతుల్లో 8 పరుగులు చేసి విజయతీరాలకు చేరింది.

అంతకముందు 201 పరుగుల భారీ లక్ష్యంతఓ బరిలోకి దిగిన ముంబైకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. రోహిత్ శర్మ 8,డికాక్ 14,సూర్య కుమార్ యాదవ్ 0 వెంటవెంటనే వెనుదిరిగారు. తర్వాత మరో వికెట్ పడకుండా ఇషాన్ కిషన్,హార్ధిక్ పాండ్యా కాసేపు జాగ్రత్త పడ్డా…ఆడమ్ జంపా బౌలింగ్‌లో వెనుదిరిగాడు హార్ధిక్. దీంతో ముంబై మరింత కష్టాల్లోకి జారుకుంది.

ఈ దశలో క్రీజులోకి వచ్చిన పోలార్డ్, ఇషాన్ కిషన్‌తో కలిసి జట్టును గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్నారు. 58 బంతుల్లో ఇషాన్ 99 పరుగులు చేయగా పోలార్డ్ 2 బంతుల్లో 60 పరుగులు చేసి స్కోరు సమం చేశారు. చివరి ఓవర్‌లో విజయాన్ని 17 పరుగులు కావాల్సిఉండగా 19 పరుగులు కావాల్సిఉండగా 18 పరుగులు చేసింది ముంబూ. దీంతో సూపర్ ఓవర్‌ ఆడాల్సిన పరిస్దితి ఏర్పడింది.

అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ భారీ స్కోరు సాధించింది. 20 ఓవర్లలో 3 వికెట్లు కొల్పోయి 201 పరుగులు చేసింది.ఇక ఐపీఎల్‌లో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ కొనసాగుతూనే ఉంది. వరుసగా మూడో మ్యాచ్‌లో నిరాశపర్చాడు విరాట్ కోహ్లీ.ఫించ్ 35 బంతుల్లో 52 పరుగులు చేయగా పడిక్కల్ 40 బంతు్లో 54 పరుగులు చేశారు.విరాట్ కోహ్లీ 11 బంతుల్లో 3 పరుగులు చేయగా డివిలియర్స్ 24 బంతుల్లో 55 పరుగులు చేశారు. దీంతో బెంగళూరు నిర్ణీత ఓవర్లో 201 పరుగులు చేసింది.

- Advertisement -