బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 23 హైలైట్స్

175
epsiode 23
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 23 ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. సోమవారం నాలుగో నామినేషన్ వారం కావడంతో ఏడుగురు సభ్యులు ఎలిమినేషన్‌కు నామినేట్ కావడంతో ఎపిసోడ్ ముగిసింది.

గోంగూర తోట కాడ కాపుకాశా.. అనే మాస్ బీట్‌ సాంగ్‌కి ఉదయాన్నే స్టెప్పులు వేశారు కంటెస్టెంట్లు. మార్నింగ్ మస్తీలో భాగంగా స్వాతి దీక్షిత్ నవరసాలు నేర్పించాలని బిగ్ బాస్ ఆదేశించడంతో మొదట శృంగార రసాన్ని అభిజిత్‌తోనే పంచుకుంది స్వాతి. తర్వాత నవరసాలను నేర్పించి శభాష్ అనిపించుకుంది.
కోపం రసాన్ని పిండటానికి రంగంలోకి దిగిన లాస్య-నోయల్‌లు ఆస్కార్ రేంజ్ పెర్ఫామెన్స్ ఇచ్చేశారు.

తర్వాత మొనాల్-మెహబూబ్‌లు నామినేషన్స్ గురించి చర్చించగా అరియానా-అవినాష్‌లు రొమాన్స్, కెమిస్ట్రీపై ఫన్నీ చర్చలు జరిపారు. కుమార్ సాయిని లూజ్ అనడంపై అభితో చర్చించింది దివి.ఈవారం నామినేషన్స్‌లో భాగంగా సొహైల్-అఖిల్‌ ఇద్దరూ హిట్ మెన్‌లుగా ఉంటారని.. ఈ ఇద్దరికీ ఒక డెన్ ఉంటుందని.. వాళ్లకు తలో ఐదు వేలు ఇచ్చారు

బిగ్ బాస్. అలాగే ఇంటి సభ్యులందరికీ తలో పది వేలు ఇచ్చారు.ఐదుసార్లు బజర్ మోగుతుంది మోగిన ప్రతిసారి హిట్ మెన్‌లు ఉండే డెన్‌కి వెళ్లి.. ఎవర్ని షూట్ చేయాలో చెప్పి డీల్ కుదుర్చుకోవాలని చెప్పారు. పోటీ పడి డెన్‌కి వెళ్లాలని అలా వెళ్లిన వాళ్లు సేవ్ కావడంతో పాటు ఒకర్ని నామినేట్ చేయొచ్చని చెప్పారు బిగ్ బాస్.తర్వాత కెప్టెన్‌గా ఉన్న గంగవ్వతో పాటు అరియానాలు ఈవారం నామినేషన్స్ నుంచి సేవ్ అయినట్టు చెప్పారు బిగ్ బాస్.

మొదటిగా రాజశేఖర్ మాస్టర్ వెళ్లి స్వాతి దీక్షిత్‌ని షూట్ చేయాలనిడీల్ కుదుర్చుకోవడంతో ఆ డీల్‌ని అఖిల్ కంప్లీట్ చేశాడు. దీంతో స్వాతి డెడ్ అయ్యింది.అఖిల్‌కి 10 వేలు వచ్చాయి.తర్వాత మెహబూబ్ వెళ్లి అభిజిత్‌ని షూట్ చేయాలని హిట్ మెన్‌లతో డీల్ కుదుర్చుకున్నాడు. దీంతో అఖిల్ వెళ్లి అభిని షూట్ చేశాడు. దీంతో అభి ఈవారం నామినేషన్‌లోకి వచ్చాడు.

తర్వాత అరియానా గ్లోరి లాస్య పేరు చెప్పగా ప్రతివారం మాదిరే మెహబూబ్‌ని నామినేట్ చేసింది హారిక. దీంతో మొహబూబ్ నామినేట్ అయ్యాడు. చివరిగా బజర్ మోగే టైంకి సుజాత రావడంతో కుమార్ సాయిని షూట్ చేయడానికి డీల్ కుదుర్చుకుంది.మొత్తంగా హిట్ మెన్లుగా ఉన్న అఖిల్, సొహైల్‌లలో నాలుగు సార్లు గన్‌ని చేజిక్కించుకుని 40 వేలను సంపాదించాడు అఖిల్. సొహైల్ ఒకే ఒక్కసారి గన్‌ని సంపాదించడంతో పది వేలు మాత్రమే సంపాదించాడు. ఈ ఇద్దర్లో ఎవరిదగ్గర తక్కువ డబ్బు ఉంటే వాళ్లు నామినేట్ అయ్యే అవకాశం ఉండటంతో అఖిల్ బయటికి వెళ్లినప్పుడు అతడి డబ్బును దొంగతనం చేసిన అఖిల్ ఎలిమినేషన్ నుండి తప్పించుకోగా సొహైల్ నామినేట్ అయ్యాడు.

అఖిల్ సేవ్ కావడంతో ఒకరిని నామినేట్ చేసే అవకాశం ఉండటంతో హారికను నామినేట్ చేశాడు. నాలుగోవారం ఎలిమినేషన్స్‌కి హారిక, స్వాతి దీక్షిత్, అభిజిత్, లాస్య, మెహబూబ్, కుమార్ సాయి, సొహైల్‌ నామినేట్ అయ్యారు.

- Advertisement -