IPL 2024 :ఆర్సీబీ పనైపోయిందా?

43
- Advertisement -

ఐపీఎల్ 17వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుస పరాజయాలను ఎదుర్కొంటుంది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ కేవలం ఒక్క మ్యాచ్ లో మాత్రమే గెలిచి ఐదు ఓటములను మూటగట్టుకుంది. దాంతో పాయింట్ల పట్టికలో చివరి రెండో స్థానంలో ఉంది. మరో రెండు మ్యాచ్ లు ఓడిపోతే ఆర్సీబీకి ప్లే ఆఫ్ అవకాశాలు సన్నగిల్లినట్లే. నిన్న ముంబై తో జరిగిన మ్యాచ్ మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.

బ్యాటింగ్ లో డూప్లెసిస్ (61), పాటిదార్ (50), దినేష్ కార్తీక్ (53) పరుగులతో రాణించారు. బ్యాట్స్ మెన్స్ పరవలేదనిపించినప్పటికి బౌలర్స్ మాత్రం తేలిపోయారు. లక్ష్య చేధనలో బ్యాటింగ్ కు దిగిన ముంబై బ్యాట్స్ మెన్స్ ను కంట్రోల్ చేయడంలో విఫలం అయ్యారు. దాంతో 15 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది ముంబై ఇండియన్స్. ఇషాన్ కిషన్ (69), రోహిత్ శర్మ(38), సూర్య కుమార్ యాదవ్ (52), హర్ధిక్ పాండ్యా (21) పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. దాంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో స్థానాన్ని మెరుగు పరచుకుంది.

ఆర్సీబీ బౌలింగ్ ఎఫెక్ట్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో బ్యాట్స్ మెన్స్ కోహ్లీ, డూప్లెసిస్, దినేష్ కార్తీక్ మినహా మిగిలిన వారు పెద్దగా రాణించడం లేదు. ఇక బౌలర్స్ అత్యంత ఫెళవమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్ లలో బౌలర్స్ వైఫల్యమే ఎక్కువ అని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మహ్మద్ సిరాజ్,టోప్లే, ఆకాష్ దీప్.. ఇలా ప్రతి ఒక్కరూ ధారాళంగా పరుగులు ఇస్తుండడంతో జట్టును వరుస ఓటములు పలకరిస్తున్నాయి. బౌలింగ్ లో మెరుగు పడకపోతే ఈ సీజన్ ఐపీఎల్ లో ఆర్సీబీ లీగ్ దశలోనే వెనుదిరగడం ఖాయమని చెబుతున్నారు క్రీడా విశ్లేషకులు.

నేటి మ్యాచ్ లు

నేడు జరిగే మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ మరియు డిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. లక్నో వరుస విజయాలతో జోరు మీద ఉండగా డిల్లీ క్యాపిటల్స్ వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. మరి రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తుందో చూడాలి.

Also Read:ఒంటిమిట్టలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

- Advertisement -