నిలకడగా రజినీ ఆరోగ్యం.. తాజా అప్‌డేట్‌..

40
Rajinikanth

సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆస్పపత్రి వైద్య బృందం తాజా హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. సాయంత్రం 6 గంటలకు వెల్లడించిన వివరాల ప్రకారం.. రజినీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఇప్పటివరకు నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అంశాలను గుర్తించలేదని పేర్కొన్నారు. మరికొన్ని వైద్య పరీక్షల నివేదికలు రావాల్సి ఉందని వెల్లడించారు. వైద్య పరీక్షల నివేదికలు రాగానే అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఆదివారం ఆయనను డిశ్చార్జి చేస్తామని తెలిపారు.

రజనీకాంత్‌ వెంట ఆయన కూతురు ఉండి బాగోగులు చూస్తోంది. రజనీకాంత్‌ను పరామర్శించేందు వచ్చే ఎవరినీ ఆసుపత్రి వర్గాలు లోపలికి అనుమతి ఇవ్వడం లేదు. కాగా సూపర్ స్టార్ రజినీకాంత్ హైబీపీతో శుక్రవారం ఉదయం హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయిన విషయం తెలిసిందే. రజినీకాంత్ గత 10 రోజులుగా హైదరాబాద్‌లోనే ఉన్నారు. అన్నాత్తై షూటింగ్ కోసం ఆయన నగరానికి వచ్చారు.