రైతులతో కేంద్రం మరోసారి చర్చలు..

31
Farmers Protest

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులోని సింఘు వద్ద నెల రోజులకుపైగా రైతులు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర మరోసారి చర్చలకు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో శనివారం 40 రైతు సంఘాల నేతలు సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఆరో విడత చర్చలకు తేదీ, సమయాన్ని రైతు నేతలే నిర్ణయించాలని తాజాగా కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనపై రైతు సంఘాల నేతలు స్పందించారు.

ఇందుకు ఈ నెల 29న ఉదయం 11 గంటలకు కేంద్రంతో చర్చలు జరుపుతామని సంయుక్త్ కిసాన్ మోర్చా (SKM) నేతలు తెలిపారు. కేంద్రంతో మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించినట్లు స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. కాగా, రైతుల సంఘాలు, కేంద్రం మధ్య ఇప్పటికే పలు దఫాల చర్చలు జరిగాయి. కానీ ఎలాంటి పరిష్కారం దొరకడం లేదు. కేంద్రం చెప్పిన ఏ ప్రతిపాదనకూ రైతులు అంగీకరించడం లేదు. మూడు చట్టాలను రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టుతున్నారు.