ముస్లిం సోదరీసోదరులకు రంజాన్ శుభాకాంక్షలు: సీఎం కేసీఆర్

43
cm kcr

పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరీసోదరులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస ధీక్షలతో రంజాన్ మాసం శాంతి, ప్రేమ, దయ సౌభ్రాతృత్వ గుణాలను పంచుతుందని, తెలంగాణలో గంగా జమునా తహజీబ్ కు రంజాన్ పర్వదినం ప్రతీక అని సీఎం అన్నారు. మైనారిటీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న పలు పథకాలు ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని, గుణాత్మక ఫలితాలనిస్తున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు.