రాష్ట్రంలో మూడురోజుల పాటు వర్షాలు..

106
rain in ts

తెలంగాణలో నేటి నుంచి మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి మధ్యప్రదేశ్ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ నివేదికలో పేర్కొన్నారు. మధ్య మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ మీదుగా ఈ ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వివరించారు. దీని ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు. ఒకట్రెండు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు.