గ్రామ స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు..

47
koppula

పెద్దపల్లి జిల్లాలో యాసంగి 2020-21 పంటకు సంబంధించి నాణ్యమైన ధాన్యాన్ని చివరి గింజ వరకు మద్దతు ధరపై కొనుగోలు చేస్తామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలియ చేశారు. పెద్దపల్లి జిల్లాలో పండించిన యాసంగి 2020-21 ధాన్యం కోనుగోలు అంశం అవగాహన కార్యక్రమంపై శనివారం స్థానిక అమర్ చంద్ కళ్యాణ మండపంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఐకేపి, పీఎసిఎస్ మరియు ఎఎంసి కోనుగోలు కమిటి సభ్యులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

ఈ సమావేశం లో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ పుట్ట మధు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, డి.సి.యం.ఎస్ ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మెన్ రఘువీర్ సింగ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తిరుమల్ ప్రసాద్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి తోట వెంకటేశ్, మార్కెటింగ్ ఏ.డి ప్రవీణ్, పౌర సరఫరా సంస్థ అధికారి ప్రవీణ్, ప్రజాప్రతినిధులు, రైస్ మిల్లర్లు, సంబంధిత అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.