నీట మునిగిన షూటర్ గగన్‌ నారంగ్‌ అకాడమీ..

190
Gagan Narang academy

తిరుమల్‌గిరిలోని షూటర్ గగన్‌ నారంగ్‌కు చెందిన ‘గన్‌ ఫర్‌ గ్లోరీ’ అకాడమీ ఇటీవల కురిసిన భారీ వర్షానికి నీట మునిగింది. దీంతో అత్యాధునిక 90 రైఫిళ్లు, పిస్టళ్లలో నీళ్లు చేరాయి. రూ.1.30 కోట్ల సొంత ఖర్చుతో నారంగ్‌ జర్మనీ నుంచి రైఫిళ్లు దిగుమతి చేసుకున్నారు. నవంబరు 1న గచ్చిబౌలీ షూటింగ్‌ రేంజ్‌లో అకాడమీని ప్లాన్ చేశారు. దీని కోసం రెండు నెలల క్రితమే జర్మనీ నుంచి సామగ్రిని తెప్పించారు నారంగ్.

ఈ సందర్భంగా నారంగ్‌ మాట్లాడుతూ.. ఒక్కసారి కూడా రైఫిళ్లు ఉపయోగించలేదుని గగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లేసరికి అకాడమీ 8 అడుగుల నీటిలో మునిగింది. అకాడమీ కోసం తొమ్మిదేళ్లు కష్టపడ్డ తమ బృందానికి తీవ్ర నిరాశ కలుగుతోందని గగన్ ఆవేదన చెందారు.