వరద బాధితులకు అండగా ఎమ్మెల్యే వివేకానంద్..

358
MLA KP Vivekananda

హైదరాబాద్‌లో ఎడతెరపి లేకుండా ముంచెత్తిన వానలకు అతలాకుతలం అయిన వరద బాధితులను ఆదుకోవడంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ తన ఒక్క నెల జీతాన్ని ‘ముఖ్యమంత్రి సహాయనిధి‘కి విరాళంగా ప్రకటించారు. అలాగే హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యల నిమిత్తం తామ ఒక నెల జీతాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించాలని హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ నెంబర్ లు నిర్ణయించారు. వీరితో పాటు తమకు వచ్చే నాలుగు నెలల గౌరవ వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధి అందించనున్నట్లు కంటోన్మెంట్ బోర్డు సభ్యులు తెలిపారు. ఈ మేరకు ఒక లేఖను పురపాలక శాఖ మంత్రి  కె తారకరామారావు కి అందించారు.