ఏపీలో కొత్తగా 3,967 పాజిటివ్ కేసులు నమోదు..

106
ap corona

ఆంధ్రప్రదేశలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది.. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 3,967 పాజిటివ్ కేసులు రాగా, 25 మంది మరణించారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 627 కొత్త కేసులు రాగా, అత్యల్పంగా విజయనగరంలో జిల్లాలో 86 మందికి నిర్ధారణ అయింది. తాజాగా 5,010 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక, రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,75,470కి చేరగా, 7,30,109 మందికి కరోనా నయం అయింది. ఇంకా 38,979 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 6,382కి పెరిగింది.