అన్నిరాష్ట్రాలను కలపుకుంటు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర ముగింపు దశకు చేరుకుంది. దాదాపు 145 రోజుల పాటు యాత్ర సాగగా ఇవాళ శ్రీనగర్‌లో పెద్ద ఎత్తున ముగింపు సభను నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే 23 ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానం పంపింది కాంగ్రెస్ పార్టీ.
దాదాపు 4 వేల కిలోమీటర్లకు పైగా యాత్ర సాగగా వివిధ వర్గాల ప్రజలతో మమేకమయ్యారు రాహుల్. వారితో సమావేశాలు నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
134 రోజులపాటు 12 రాష్ట్రాల మీదుగా 4,084 కిలోమీటర్లమేర పాదయాత్ర సాగింది. ప్రతి రాష్ట్రంలో బహిరంగ సభ, అక్కడక్కడా కార్నర్ మీటింగులతో తన అభిప్రాయాలను వెల్లడించారు. రాహుల్ తన యాత్ర ద్వారా కాంగ్రెస్ శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపారు. వివిధ రాష్ట్రాల్లో ఎడమొహం పెడమొహంతో ఉన్న నాయకులను ఏకతాటిపైకి తీసుకొచ్చారు. వ్యక్తిగత విభేధాలను పక్కనబెట్టి పార్టీ పటిష్టతకోసం పనిచేయాలనే సంకేతాలను జారీ చేశారు. పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహాన్ని పెంపొందించారు.
ఇవి కూడా చదవండి..