దోసకాయతో ఉపయోగాలు..

142
- Advertisement -

ఎంతో మంది ఇష్టంగా తినదగిన ఆహార పదార్థాలలో కీరదోస లేదా దోసకాయ కూడా ఒకటి. దీనిని పచ్చిగా అయిన లేదా ఏదైనా సలాడ్ లలో కూడా మిక్స్ చేసి తింటూ ఉంటారు. ఈ కీరదోస శరీరంలోని వేడిని తగ్గించి చలువను పెంచుతుందని అందరికీ తెలిసిందే. ఎందుకంటే దోసకాయలో 95 శరం నీటితో కూడిన ఆక్సీటాసిన్లు ఉంటాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను సమతుల్య పరిచి చల్లదనాన్ని పెంచుతాయి. అంతే కాకుండా కీరదోస ప్రతీరోజు తినడం వల్ల ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో చూద్దాం

దోసకాయను ప్రతిరోజూ తినడం వల్ల పొట్టలోని మలినలు బయటకు పోతాయి. తద్వారా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. కీరదోసలో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి తో పాటు, ఎముకల వృద్దికి ఉపయోగపడే విటమిన్ కె, వంటి ఎన్నో సూక్ష్మ పోషకాలు ఉంటాయి. ఇక దీనిలో ఉండే మెగ్నీషియం, పొటాషియం వంటివి అధిక రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కీరాలో ఉండే కేఫిక్ఆమ్లం కాళ్ళు మరియు చేతులలోని కీళ్ల నొప్పులను దూరం చేస్తుంది. ఇక కిరదోస విత్తనాలలోనూ, తొక్కలోనూ,బీటాకెరోటిన్ శాతం అధికంగా ఉంటుంది. దీని వల్ల కంటి సమస్యలు దూరం అవుతాయి. దోసకాయకు క్యాన్సర్ ను తగ్గించే గుణాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

లారిసేరిసినాల్, ఫినోరేసినాల్, సెకోయుసోరిశినాల్, అండాశయ గర్భాశయ ప్రోస్టేట్ క్యాన్సర్లను తగ్గిస్తుందట. అలాగే కీరదోసలో ఉండే గ్లైకోసైడ్లు ప్లేవనైడ్లు శరీరంలోని ఇన్సులిన్ ను క్రమబద్దీకరించడంతో పాటు జీవక్రియను కూడా మెరుగు పరుస్తుంది. కిరా చర్మ సౌందర్యాన్ని పెంచడంలో కూడా ఎంతగానో ఉపయోగ పడుతుంది. దోసను గుజ్జులా చేసి ఫేస్ కు మాస్క్ ల అప్లై చేస్తే మొఖం పై ఉండే మచ్చలు తగ్గుతాయి. ఇక వేసవిలో కీరదోస ముక్కలు, పుదీనా కలిపి మిక్స్ చేసి జ్యూస్ లా తాగితే డీహైడ్రేషన్ వంటి సమస్యలు రాకుండా ఉనాయి. ఇక బరువు తగ్గాలనుకునే వారికి కూడా కీరా చక్కటి ఔశదంలా పని చేస్తుంది. ఇందులో నీటి శాతం అధికంగా ఉండడం వల్ల దీనిని తింటే పొట్ట నిండిన భాగాన కలుగుతుంది. తద్వారా ఆకలి అనిపించదు. అయితే కిరదోసలను అధికంగా తింటే అతిమూత్రం, కడుపుఉబ్బరం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల తగు మోతాదులో వీటిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

 Also Read: కానుగ కషాయం తాగితే ఎన్ని లాభాలో!

 

- Advertisement -