కేంద్రాన్ని నిలదీయగలరా..?ఆరెస్సెస్‌పై రఘురామ ఫైర్

205
rajan

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)పై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్. ఇన్ఫోసిస్ సంస్థపై ఆరెస్సెస్ అనుబంధ పత్రిక విమర్శలు గుప్పించిన నేపథ్యంలో స్పందించిన రాజన్… కరోనా వ్యాక్సిన్ల విషయంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వాన్నీ ఇలాగే విమర్శించగలరా? అంటూ ప్రశ్నించారు.

వ్యాక్సిన్లను సమయానికి అందించని కేంద్ర ప్రభుత్వాన్ని జాతి వ్యతిరేకి అని అనగలరా? అని ఏకీపారేశారు. దేశంలో చిన్న సంస్థలతో పోలిస్తే పెద్ద సంస్థలే ఎక్కువగా లబ్ధి పొందుతున్నాయని, వాటికే లాభాలు వస్తున్నాయని ఆయన చెప్పారు. దేశంలో జీఎస్టీ అమలు గొప్పగా లేదన్నారు. మరింత మంచిగా దానిని అమలు చేయొచ్చన్నారు. ఆ తప్పుల నుంచి నేర్చుకోవాలని, కానీ, సొంత ప్రయోజనాల కోసం వాటిని వాడుకోకూడదని ఆయన సూచించారు.ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు 30 శాతం పెరిగాయని, రూ.1.12 లక్షల కోట్ల పన్నులు వసూలయ్యాయని చెప్పారు. రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయాల్లో ఎక్కువ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే స్వాహా చేస్తోందని విమర్శించారు.