రాష్ట్రంలో 2 కోట్ల మందికి వ్యాక్సినేషన్..

14
vacciantion

రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 2 కోట్ల మందికి వ్యాక్సినేష‌న్ పూర్త‌యినట్లు సీఎస్ సోమేశ్ కుమార్ వెల్లడించారు. ప్ర‌త్యేక కేంద్రాల ద్వారానే కాకుండా, మొబైల్ సెంట‌ర్ల ద్వారా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ కొన‌సాగుతోంది.

ఈ సంద‌ర్భంగా తాత్కాలిక స‌చివాల‌యం బీఆర్కే భ‌వ‌న్‌లో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ కేక్ క‌ట్ చేశారు. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో పాల్గొన్న అధికారులు, సిబ్బందిని సీఎస్ అభినందించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వి, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేష్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఓఎస్‌డీ గంగాధర్, వైద్య శాఖ సంచాలకులు జీ శ్రీనివాస్ పాల్గొన్నారు.