అసెంబ్లీ బరిలో ప్రియాంక..!

90
gandhi

త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటినుండే రంగం సిద్ధం చేస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఇప్పటికే ప్రియాంక సారథ్యంలో ఎన్నికల బరిలోకి వెళ్లేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతుండగా గత ఎన్నికల్లో ప్రచారానికే పరిమితమైన ప్రియాంక గాంధీ వాద్రా ఈసారి మాత్రం ఎన్నికల్లో పోటీచేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.

తొలిసారి గాంధీ కుటుంబం నుంచి అసెంబ్లీకి పోటీచేసేందుకు ప్రియాంకగాంధీ సిద్ధమైంది. కాంగ్రెస్‌కు పట్టున్న రాయ్‌బరేలి, ఆమేథి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకదాని నుంచి ప్రియాంక నామినేషన్ వేయనున్నారు. ప్రియాంక పోటీ చేస్తారన్న వార్తల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఆనందం నెలకొంది. నిపుణులు సైతం ప్రియాంక అసెంబ్లీ బరిలో దిగడం ద్వారా కాంగ్రెస్ బలపడే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటివరకు గాంధీ కుటుంబం నుంచి అసెంబ్లీకి పోటీచేసిన వారు ఎవరూ లేరు. ప్రియాంక పోటీ చేస్తే తొలి వ్యక్తి అవుతారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ అందరూ లోక్‌సభ ఎన్నికల్లోనే పోటీచేశారు.