ప్రతీ సినిమా ఓ అందమైన ప్రయాణం..

387
raashi khanna

మనం చిత్రంలో అతిధి పాత్రలో మెరిసి.. ఊహలు గుసగుసలాడే చిత్రంతో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ముంబై ముద్దుగుమ్మ రాశి ఖన్నా. ఊహలు గుసగుసలాడే చిత్రంలో తన నటనతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా జెట్ స్పీడుతో దూసుకుపోతున్న రాశీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఓ సినిమా విజయం సాధించవచ్చు. సాధించకపోవచ్చు. కానీ, ప్రతి సినిమా ఓ అందమైన ప్రయాణం అని చెప్పుకొచ్చింది. ప్రతి సినిమాలో మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం. మన సామర్థ్యం మేరకు నటులుగా ఎదుగుతాం. తాను చేసిన ప్రతి సినిమాకీ నేను అండగా నిలబడతా అని తెలిపింది.

ఫిబ్రవరిలో విడుదలైన ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’లో ఆమె బోల్డ్‌గా నటించారు. వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ లో యామినీ పాత్ర చేసినందుకు బాధ పడుతున్నట్టు కొందరు కథలు అల్లేశారు కానీ అందులో నిజంలేదన్నారు.