రిషి ఆరోగ్యం బాగానే ఉంది: కుటుంబసభ్యులు

199
rishi
- Advertisement -

ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషీ కపూర్‌ ఆరోగ్య పరిస్ధితి బాగాలేకపోవడంతో ఆస్పత్రిలో చేరారు. దీంతో ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారని ..పరిస్ధితి విషమించిందని పుకార్లు షికార్ చేస్తున్నాయి. ఈ వార్తలను కొట్టిపారేశారు రిష సోదరుడు రణధీర్ కపూర్.

రిషి కపూర్‌ ఆరోగ్య పరిస్ధితి బాగానే ఉందన్నారు. రిషికి క్యాన్సర్ ఉండటంతో శ్వాస తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని దీంతో వెంటనే ముంబైలోని సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్లో చేర్పించామన్నారు.

1970లలో బాబీతో సినీరంగ ప్రవేశం చేసిన రిషీ కపూర్ వయసు 67 సంవత్సరాలు. లెజెండరీ హీరో, డైరెక్టర్ రాజ్ కపూర్ రెండవ కుమారుడు. 2018 నుండి క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. రణబీర్ కపూర్ …రిషీ కుమారుడే.

- Advertisement -