అల్లు అర్జున్‌ ‘పుష్ప’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌..

34
Pushpa

టాలీవుడ్ ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతోన్న మూవీ ‘పుష్ప’. స్టైలిష్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. మైత్రిమూవీ మేకర్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమాలో ఫహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడు నటిస్తున్నాడు. అల్లు అర్జున్‌కు జోడీగా రష్మిక సందడి చేయనున్నారు. ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. దేవిశ్రీ స్వరాలు అందిస్తున్నారు.

ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సిద్ధమవుతోన్న ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్‌ పాత్ర పోషిస్తున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ఇందులో బన్నీ ఊరమాస్‌ గెటప్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాలో రష్మిక పుష్పరాజ్‌ ప్రేయసి శ్రీవల్లిగా డీ గ్లామర్‌ రోల్‌లో కనిపించనున్నారు. కాగా తాజాగా ‘పుష్ప’ రిలీజ్‌ డేట్‌ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 17న ‘పుష్ప’ ఫస్ట్‌ పార్ట్‌ను ‘పుష్ప ది రైజ్‌’ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.